Suniel Narang Resign

హైదరాబాద్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (1TCC) అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ (Summel Nanmg) రాజీనామా చేశారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే తన పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం తెలుగు సినీ వర్గాల్లో సంచలనమైంది.

శనివారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో టీఎస్ సీసీకి కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించిన సంగతి తెలిసించే మూడోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ సహా 15. మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ నారంగ్ మాట్లాడుతూ… థియేటర్ల వ్యవహారంలో ఆ నలుగురు ఎవరూ లేరని, యజమానుల వద్దే వారి థియేటర్లు. ఉన్నాయని పేర్కొన్నారు. హీరోలు దేవుళ్లు లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహనం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని వ్యాఖ్యానించారు. అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తుపానులాంటి వారని, ఆయన సినిమాను అపే అధికారం ఎవరికి లేదన్నారు.

టీఎప్సిసీ అధ్యక్షుడిగా ఎన్నికై 24 గంటలు గడవక ముందే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం సునీల్ నారంగ్ ప్రకటన విడుదల చేయటం సర్వత్ర చర్చనీయాంశమైంది. తనని సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని అందులో ఆయన తెలిపారు. తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా పదవిలో కొనసాగలేనని స్పష్టం చేస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *